నవ్యాక్షరం – కవిత్వం : వర్చువల్ లవ్

వర్చువల్ లవ్

— పి.శ్రీనివాస్ గౌడ్

ఏమీ తోచనపుడు
నీ చాట్ తెరుస్తాను.
అంతకు ముందే అంతా చెప్పేసిన ఎమోజీలు
అడుగునున్న గోల్డెన్ డ్రాప్స్ రాలుస్తాయి.
ఒక్కక్క వాక్యం పోస్ట్ చేసే ముందు
నీ త్రీ డాట్స్ చాట్ వేవ్..
స్క్రీన్ మీద లాస్ట్ సీన్ టైమ్ డిస్ల్పే..
నీ వాట్సప్ పేరు ముందు పేరుకున్న
మెసేజ్‌ల అంకెలు
నాకు కొత్త వ్యసనాల సంకెలలు.
ఎప్పుడూ నువ్వు
నా ఫోన్‌లో వెలిగే గ్రీన్ డాట్
ఐడీలు అడ్రస్‌లు అకౌంట్లు
ఛార్జింగ్‌లు రీచార్జ్లుడిస్చార్జ్లు
ఒక కొత్త పరిభాష.
సాంకేతికత లతల మీద
పాకుతున్న ప్రేమ తీగలు
చిక్కుపడకుండా
క్లియర్ చాట్ కొట్టినా
మనసు మెమరీలో స్టోర్ చేసుంచుతా.
వీడియో కాల్‌లో అందేంత దూరంలో వుండు.
ఒక మెసేజ్‌కే వచ్చేసేంత దగ్గరలో వుండు.
చేతిలో చెయ్యేసుకొని
కాసింత ఆకాశాన్ని, కాసిని నక్షత్రాల్ని ముందేసుకొని
ఈ వర్చువల్ వరల్డ్‌ని స్విఛాఫ్ చేద్దాం.

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading