సంయమనం
-బసవరాజు వేణుగోపాల్
భూనభోంతరాలు ప్రకంపించి భూమి బద్దలైమనిషీ.. గొడ్డూ,ఇళ్ళూ ఊళ్ళూ సమస్తం,కూరుకుపోతే ?
ఖణేల్ ఖణేల్మంటూ ఆకాశం దద్దరిల్లి అగ్గివాన కురిసి
సమస్త భూమి బుగ్గిపాలైతే ?
హిమాలయాలు కరిగి నదులు పొంగివరదనీటితో మునిగి ప్రపంచపటంపైభూమి ఆనవాళ్లే లేకుండాపోతే ?
పర్యావరణపు స్వస్తివచనాలకు స్వస్థి జెప్పిఈ మిధ్యావాదపు ప్రశ్నలెందుకు?
ఏమో!చీలిన భూమి ఇరుచెంపలనుదరిజేర్చి కుట్టే దర్జీ పుడతాడేమో…..
శబ్దభేదితో, గర్జించే నింగిని నిలువరించేవిలుకాడు వింటి సారిస్తాడేమో…
సముద్రాల్ని మింగేసే అగస్త్యుడిలా….
ఋషి పుంగవుడు మరొకడు పుడతాడేమో…
నమ్మకముంటే నదిపై నడవొచ్చు ఆశఉంటే ఆకాశానికి ఊయలగట్టి ఊగొచ్చు..రాలిన ఆకుల్ని చూసి దిగులెందుకు? తన్నుకొస్తున్న లేతచివుళ్లను చూసి సంతోషించు…..
అద్దంముందు నిల్చుని పుర్రెను చూస్కొనిఏం లాభం?కిటికీలోంచి శిఖరపు అంచును చూడు..
కొత్తముక్కు కోసం పాత ముక్కును బండకేసిబాదుకుంటున్న గద్ద కనిపిస్తుంది….
ఆ దృశ్యం కర్తవ్యమేదో బోధపరుస్తుంది…!
మెత్తటి చీకటిని పదునైన వెలుతురు కత్తితో ఖండఖండాలుగా నరుకు…
పూలపరిమళాలతో ఆవిష్కృతమయ్యే
కొత్త బంగారులోకాన్ని స్వాగతించు…
రాజ్యం సీతకన్నేస్తేనేం….
ప్రేమ రెప రెప లాడే బతుకుజెండా ఎగరేయ్!!








