పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
ఒక్క నిమిషం లో….
–పాంచజన్య
రాధాకృష్ణ ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన అబ్బాయి. స్వతః తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా, నాన్న ఉద్యోగం వల్ల, దేశం అంతా తిరుగుతూ, తండ్రి ఖమ్మంలో పని చేయటంతో ఇంజనీరింగ్ అయ్యి, GRE exam రాయటం కోసం హైదరాబాద్ వచ్చి దిల్‍సుఖ్‍నగర్‌లో తన ఫ్రండ్స్‌తో కలిసి రూమ్‌లో ఉండి కోచింగ్ తీసుకొని అమెరికాలోని సిరక్యూస్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఉద్యోగం వేటలో ఉండి ,ఎన్ని కంపెనీలకి అప్లికేషన్ పంపించినా ఒకటి కూడా సెలెక్ట్ అయ్యేది కాదు.
రాధాకి యూనివర్సిటీలో పరిచయం అయినా అమ్మాయి నందన. ఒకరు అంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ, ఏనాడు ఆ ఇష్టాన్ని వ్యక్త పరుచుకునే అవకాశం ఇద్దరికీ రాలేదు కారణం వాళ్ళ ముందర ఉన్న అవసరాలు. అమెరికా వచ్చే ప్రతి వంద మందిలో తొంబై ఏడు మంది బ్యాంకు లోన్ తీసుకొని, ఇక్కడ ఉద్యోగం తెచ్చుకుని ఆ లోన్ తీర్చుకోవాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని ఉండే వాళ్లే. అలాంటి వాళ్లలో రాధా, నందన ఇద్దరు కూడా ఉన్నారు. నందన, టెక్సాస్ లో ఉన్న తన పెద్దమ్మ గారి అబ్బాయి రోహిత్ ద్వారా ఒక కన్సల్టెన్సీలో కంప్యూటర్ ఉద్యోగం వచ్చింది.
అమెరికాలో కన్సుటెంట్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు, చదివిన చదువుతో సంబంధం లేకుండా, జనాలను వాళ్ళ రిఫరెన్స్ బట్టి, నౌలెడ్జి బట్టి, వాళ్ళ దగ్గర చేర్చుకుని, వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఇచ్చి, భోజనం పెట్టి, చేర్చుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్స్‌లో ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని ఉద్యోగంలో పెట్టి, వాళ్ళు సంపాదించే వంద రూపాయల్లో నలభై రూపాయలు తీసుకుంటారు.
రాధాకి ఎలాంటి ఇంటర్వ్యూ కాల్స్ రాకపోవటం వల్ల నందన రికమండేషన్‌తో, తాను చేరిన కన్సల్టెన్సీలోనే చేరి ఉద్యోగం తెచ్చుకున్నాడు. తెలియని సాఫ్ట్వేర్‌తో రోజూ ఎన్నో పాట్లు పడుతూ నెమ్మదిగా ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌ని నేర్చుకుని, ఉద్యోగం లో ఎదగటం మొదలు పెట్టాడు. తన లోన్ తీర్చి, ఒక మంచి కకారు కొనుక్కుని అమెరికాకి తన తండ్రి రిటైర్ అయినా తర్వాత తీస్కుని వచ్చి వాళ్ళకి అమెరికా అంతా తిప్పి చూపించాడు.
నందన మీద ఉన్న ఇష్టం, నెమ్మదిగా మొహమాటం దాటి ప్రేమని వ్యక్త పరుచుకునే దాకా వచ్చి, ఆ ప్రేమని తమ తల్లితండ్రులకి చెప్పి పెళ్లికి సిద్ధం అయ్యారు.
కానీ రాధాకి ఎప్పటికైనా ఈ కంప్యూటర్ ఉద్యోగం వదిలేసి తాను ఎంతో ఇష్టం గ చదువుకున్న బయో టెక్నాలజీ లోనే మళ్ళీ ఉద్యోగం సంపాదించి, రాణించాలి అని అనుకుంటూ ఉంటాడు.
******************
మేధా న్యూజెర్సీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్ గా పని చేస్తోంది. తాను కూడా హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో నే GRE కోచింగ్ తీసుకుని అమెరికా వచ్చి NJIT లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించింది.
తన స్నేహితులతో జెర్సీ సిటీ లో ఒక అపార్ట్మెంట్‌లో అద్దెకి ఉంటూ వీకెండ్ వస్తే న్యూయార్క్ సిటీకి వెళ్లి వస్తూ రెండు నెలలకి ఒక్కోసారి ఎదో ఒక ఊరు ట్రిప్ పేరుతో సరదాగా తిరిగి వస్తు ఉంటుంది.
చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న మేధాకి, తల్లి, అన్న ఉన్నారు. అన్న హైదరాబాద్‌లో ఒక ప్రముఖ సినిమా స్టూడియోలో సౌండ్ మిక్సింగ్ డిపార్ట్మెంట్‌లో పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. చెల్లెలు మేధా పంపించే డబ్బుతో తన డబ్బు కలిపి గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్ కొని, సౌకర్యవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇండియాలో ఉంటున్నప్పుడు మేధా చదువుతున్న GRE కోచింగ్ సెంటర్‌లో తనకి పరిచయం అయిన రవితో ప్రేమలో పడి, తనతో ఎంతో జీవితం ఊహించుకుంది. కానీ క్రమక్రమేణా ప్రయోజకత్వం, లక్ష్యం లేని రవితో ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు మేధాకి.
అమెరికాకి వచ్చిన తర్వాత, తన చదువు, ఉద్యోగంతో జీవితం గడిపేస్తూ ఉన్న సమయంలో, తన కూతురుకి పెళ్లి చెయ్యాలి అని నిశ్చయం తో కూతురుని పెళ్లి చేసుకోవటానికి ఒప్పించే ప్రయత్నం చేసింది తల్లి. మేధా మాత్రం ఎందుకో తన గతం లో జరిగిన అనుభవం వల్ల ప్రేమ ,పెళ్లి అంటే ఒక విముఖత చూపించేది.
ఇక ఇది లాభం లేదు అని అనుకున్న తల్లి, అమెరికా వచ్చి, కూతురు మనసు మార్చాలి అనే ఉద్దేశంతో, అమెరికా ప్రయాణానికి సన్నద్ధం అయింది.
******************
పైన ఉన్నది అంతా చదువుతుంటే ఎంతో సామాన్యంగా ఉండి కదా, సింపుల్‌గా.. కానీ విధికి ఇంకొక ప్రణాళిక ఉండి, పైన ఉన్నట్టు ఏమి జరగలేదు.
రాధా, మేధా ఇద్దరూ ఒకే GRE కోచింగ్ సెంటర్ లో చేసారు, ఒకరికి ఒకరు తెలుసు, రాధాకృష్ణకి, రవికి మధ్య చిన్నపాటి గొడవలు ఉండేవి. రాధాని ‘ఒరేయ్ అరవోడా’ అని రవి ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవాడు. కొన్ని సార్లు కోచింగ్ అయిపోయిన తర్వాత రాధాకృష్ణ తన బ్యాచ్‌తో, రవి తన బ్యాచ్‌తో, వేంకటాద్రి థియేటర్ వెనకాల సందు లో కొట్లాటలు పెట్టుకునే వారు. ఇలా గొడవలు జరుగుతున్నా, తన లక్ష్యం ఎప్పుడు అశ్రద్ధ చేయకుండా తన తండ్రి చెప్పినట్టు అమెరికా వెళ్లి, అక్కడ స్థిరపడాలి అని కష్ట పడేవాడు రాధా.
ఇదంతా పట్టించుకునేది కాదు మేధా. తన లోకం తనది. అమ్మ, అన్నయ్య, రవి ఇంకా GREలో మంచి మార్కులు తెచ్చుకుని, తానూ రవి ఇద్దరూ అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు.
సెప్టెంబర్ సెమిస్టర్ కోసం మార్చ్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అని GRE Exam రాయటానికి, ఫిబ్రవరిలోనే ఎక్సమ్ షెడ్యూల్ పెట్టుకున్నారు ముగ్గురూ. అలానే ఫిబ్రవరి 21 గురువారం రోజు మధ్యాహ్నం Exam రాసేశారు.
“316 నాకు. NJIT పక్కా వచ్చేస్తుంది. నీ స్కోర్ ఎంత వచ్చింది?” ఆతృతగా అడిగింది మేధా, రవిని.
“పోయింది , 296 వచ్చింది. ” సిగెరెట్ట్ ముట్టిస్తూ విసుగుతో చెప్పాడు బస్టాప్‌లో కూర్చున్న రవి.
“ఇలా అయితే ఈ రవీ!? మంచి యూనివర్సిటీలో సీట్ రాదు. అనుకున్న ప్లాన్స్ అన్ని స్పాయిల్ అయిపోయాయి. ఇపుడు చూడు, డెడ్‌లైన్ లోపల మళ్ళీ ఎక్సమ్ తీస్కుని మంచి స్కోర్ తెచ్చుకోవాలి అన్నా కూడా టైం సరిపోదు..” అని కంగారుగా అంది మేధా.
” కొంచం సైలెంట్‌గా ఉంటావా!, నాకే బుర్ర పని చెయ్యట్లేదు అసలు. ” అన్నాడు రవీ నీరసంగా.
” అనవసరంగా క్లాస్సేస్ జరిగినన్ని రోజులు, కాన్సంట్రేషన్ చేయకుండా అనవసరంగా ఆ రాధాతో గొడవలూ,సినిమాలూ.. ” కోపం తో అంది మేధా.
” ఆ అరవం గాడికి ఎంత వచ్చి ఉంటుందో” లోపల లోపల అనుకున్నాడు రవి
ఇంతలో 225D బస్సు వచ్చింది. ఇద్దరు బస్సు ఎక్కారు, వీళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ రన్నింగ్‌లో బస్సు ఎక్కాడు రాధా.
” ఎంత వచ్చింది రాధా నీకు ?” మొహం లో విసుగుతో అడిగింది మేధా.
“307, పర్లేదు ఏదోక యూనివర్సిటీ లో సీట్ వచ్చేస్తుంది, నాది మీ ఇద్దరి లాగా కంప్యూటర్ బ్యాచ్ కాదు కదా కంపిటేషన్ తక్కువేలే అడ్మిట్ వచ్చేస్తుంది. మీ సంగతి ఏంటి? వీడు అయితే ఖచ్చితంగా దొబ్బెట్టి ఉంటాడు!” జేబు లోంచి రుమాలు తీసి చెమట తుడుచుకుంటూ అన్నాడు రాధా.
“ఆ బాగానే వచ్చాయిలే మాకు, ఇంకా అడ్మిట్స్ గురించి టెన్షన్ మొదలు ” అంటూ మాట దాటేశాడు రవీ.
బస్సు దిల్‍సుఖ్‍నగర్ బస్టాప్ దగ్గరికి వచ్చి ఆగింది.
“నేను ఒక చాయ్ తాగి ఇంటికి వెళ్తా, మీరు వస్తారా?” అడిగాడు రాధా రోడ్ క్రాస్ చేస్తూ.
“మాకు ఏమి అక్కర్లేదులే!, నువ్వే పోయి తాగు.” అన్నాడు చిరాకుతో గ్రీన్ లైట్ పడకపోయినా మీద చేయిపట్టుకుని రోడ్ దాటుతున్న రవి.
“దీనికి తక్కువ ఏమి లేదు, బై మేధా.” చెప్పి వీళ్ళ వెనకాలే ఆ వస్తున్న వాహనాల్ని తప్పించుకుంటూ రోడ్ దాటి కోణార్క థియేటర్ దగ్గర ఉన్న టీషాప్‌కి వెళ్ళాడు రాధా.
“రేపు ఒక్కసారి వెళ్లి ఆ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడి, సేఫ్ యూనివర్సిటీస్ ఎం ఎం ఉన్నాయో కనుక్కుందాం, ఒకే యూనివర్సిటీ కాకపోయినా ఒకే ఊర్లో ఉండేలా సెట్ చేసుకోవాలి మనం.” ఎదో టెన్షన్‌తో తనతో ఆవలివైపు వేంకటాద్రి థియేటర్ దగ్గర బస్టాప్‌లో కనెక్టింగ్ బస్సు ఎక్కటం కోసం నడుస్తున్న రవీతో కూడా నడుస్తున్న మేధా.
ఇంతలో దూరం గా ఎదో పెద్ద శబ్దం వచ్చింది. ఎదో టైర్ పేలి ఉంటుంది అని పట్టించుకోకుండా తన లోకం లో తాను ఇంకో సిగెరెట్ట్ ముట్టించి నడిచి వెళ్లి బస్టాప్ లో కూర్చున్నాడు రవీ. వెనకనే వెళ్లి తన పక్కన కూర్చుంది తన ప్రణాళికల్లో మునిగిపోయిన మేధా. ఆ హడావిడిలో తన పక్కనే ఇంకొక పెద్ద శబ్దం. ఎం జరిగిందో ఇద్దరికీ తెలియదు, తెలుసుకోలేరు. వీళ్ళు ఇద్దరే కాదు ఇందాక వచ్చిన ఆ పెద్ద శబ్దం ‘నెంజుకుల్లే ’ అని హెడ్డుఫోన్స్‌లో ఆర్ రహమాన్ పాటని వింటూ, చాయ్ ఆస్వాదిస్తున్న రవి కూడా, దూరమైన లోకానికి వెళ్ళిపోయాడు. ఇలా ఈ ముగ్గురే కాకుండా, జీవితం మీద ఎన్నో కోరికలతో ఆశలతో ఉన్న 14 మంది వెళ్లిపోయారు.
ఒక ఐదు నిముషాలు బస్సు లేట్ గా వచ్చి ఉంటే ఈ ముగ్గురు వాళ్ళ కలల్ని నిజం చేస్కునే వాళ్ళు ఏమో!?
ఒక నాలుగు నిముషాలు ఆగి రోడ్ మీద తనని విసిగిస్తున్న రాధా తో రవి గొడవ పెట్టుకుని ఉంటె ఈ పాటికి పైన అనుకున్నట్టే అమెరికా లో ఇంకో జీవితం బ్రతుకుతూ ఉండేవాళ్ళు ఏమో!?
ఏమో ఒక మూడు నిమిషాలు ఆగి సిగ్నల్ గ్రీన్ పడిన తర్వాత ముగ్గురు రోడ్ క్రాస్ చేసి ఉంటె!?
ఏమో ఒక రెండు నిమిషాలు ముందర వేరే ఎదో బస్సో లారీ ఓ వచ్చి వీళ్ళకి అడ్డం గా రోడ్ దాటనివ్వకుండా చేసి ఉంటె!?
ఏమో పని చేసే ఒక్క నిమిషం ముందర ఇంత అమానుషమైన పని ఎందుకు చేయాలి అని చేసిన వాళ్ళు ఆలోచించి ఉంటె!?
ఆ ఒక్క నిమిషం 220 మంది జీవితాలని పూర్తి గా మార్చేసింది , 17 మంది జీవితాలే లేకుండా చేసింది.