పుస్తక పరిచయం – మార్జినోళ్లు

ప్రతి కథలోనూ అంతర్లీనంగా మార్పు కోసం పోరాడుతున్న పాత్రలు ఉన్న కథలు. బలమైన స్త్రీ పాత్రలు, వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న జీవితాలు.. ఇలా అన్ని ఉన్న కథలే P. శ్రీనివాస్ గౌడ్ గారు రాసిన ‘మార్జినోళ్లు- మరిన్ని కథలు’పుస్తకం. 

 

సంక్లిష్టమైన మానవ జీవనానికి ఆనవాళ్లు 'మార్జినోళ్లు' కథలు

 

ఒంగోలు, చీరాల, ప్రాంత భాషతో రాసిన కథలు, ఆలోచింపచేయడమే కాకుండా, ప్రశ్నిస్తున్నాయి కూడా. 

‘సమాధి’ కథలో చనిపోయిన మనిషిని పూడ్చడానికి కూడా భూమి లేకుండా అంతా ఆక్రమిస్తున్న వాళ్ళని కానీ, ‘దిక్కు తెలీని పక్షులు’ కథలో కొత్త ప్రభుత్వం తెచ్చిన విధానాల వల్ల ఉపాధి కోల్పోయిన ఐదు కుటుంబాల కథైనా, ‘కదిలిపోతున్న నేల’ద్వారా నేటి సమాజం మతం ఆధారంగా ఎలా విడిపోతుందో చెప్పడమైనా.. ఇలా ప్రతి కథ ద్వారా రచయిత మనకి ప్రశ్నలు సందిస్తూనే ఉన్నారు. 

‘దేవుళ్ళాట’ కథ ద్వారా గుడిలో ఉండే రాజకీయాల గురించి చూపిస్తే, ‘మార్జినోళ్లు’, ‘పీటముడి’ కథలో ప్రస్తుత సమాజపు పోకడలను ప్రశ్నించే వ్యక్తులు కనిపిస్తారు. 

‘రెటమతం మడిని’, ‘నా కొడుకు లచ్చిమి’ కథలో మానవతా  కోణం చాలా బాగా అవిష్కరిస్తే, ‘ తిరనాళ ‘ కథలో మన సమాజం లోని మృగాల గురించి చూపిస్తారు..

చాలా కథలు ప్రకాశం జిల్లా యాసలో రాసినవే.. ఇలా ప్రకాశం జిల్లాలో మాట్లాడే పదాలు తెలుసుకోవడం బాగుంది..

తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అనుకొనే వాళ్ళకి ఈ పుస్తకం ఒక మంచి ఎంపిక.

అక్కడక్కడ అచ్చు తప్పులు, పేజీ నంబర్లు సరిగ్గా లేకపోవడం మినహా కథల్ని చదివినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు.

ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది. 

 

లింక్: https://amzn.to/3PGfed3

 

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading