పుస్తక పరిచయం – మిళింద

మా మీట్ & గ్రీట్ లో ఒకసారి, “మన తెలుగు కథల్లో పాత్రలకు  ఎందుకు ఎక్కువగా రాము, సుబ్బారావు, లాంటి పేర్లు పెడతారు కానీ, రహీం,జోసెఫ్ లాంటి పేర్లు ఎందుకు పెట్టరు?” అనే ప్రశ్న వచ్చింది. ఆ రోజు ఏదో సమాధానం చెప్పుకున్నాం కానీ, ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. 

కొన్ని నెలల తర్వాత తెలుగులో LGBTQ కథలు కోసం పోస్ట్ పెట్టినప్పుడు ఎక్కువ మంది మానస ఎండ్లూరి గారు రాసిన ‘మిళింద’ పుస్తకాన్ని సూచించారు. అలా కొన్న పుస్తకం ఇన్ని రోజులకు చదివే అవకాశం దొరికింది.

 

Buy Milinda Book Online at Low Prices in India | Milinda Reviews & Ratings - Amazon.in

 

ఈ పుస్తకంలో మొత్తం 22 కథలు ఉన్నాయి. వీటిల్లో 4 కథలు LGBTQ కథలు ఉంటే.. మిగతా కథల్లో ఎక్కువ భాగం దళితులు ముఖ్యంగా దళిత క్రిస్టియన్ ల గురించిన కథలు ఉన్నాయి.

తెలుగులో దళితులు మీద చాలా కథలు చదివాను..కానీ సమకాలీన విషయాలను స్పృశిస్తూ, కథలు రాయడం వల్ల, నాకు తెలియని కొత్త విషయాన్ని తెలుసుకున్న.. ముఖ్యంగా ‘బొట్టు’ అనే అంశం మీద ఎన్ని కథలు(వ్యథలు) ఉన్నాయా అని తెలిసి ఆశ్చర్యపోయాను..

నాకు ఈ కథలు చదువుతున్నప్పుడు…  చెప్పాలి అనుకున్న అంశాన్ని సున్నితంగా చెప్పే పి. సత్యవతి గారి రచనా శైలి గుర్తుకువచ్చింది. అలానే మానస గారు వ్యంగ్యంతో రాసే మాటలు నవ్వు తెప్పిస్తూనే, ఆలోచించేలా చేస్తాయి.

ఈ పుస్తకంలో నాకు కథలు నచ్చినా, ‘జెన్నిఫర్’,  ‘ఉల్ఫత్’, ‘బొట్టు భోజనాలు’, ‘ ‘కలెక్టివ్ రేప్’, ‘అవిటి ప్రేమ’ కథలు చాలా బాగా నచ్చాయి..

ఈ రోజుల్లో కూడా మనుషుల్లో అసమానతలు లేవు అనుకొనే వాళ్ళు, ఈ పుస్తకం తప్పకుండా చదవాలి..

ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.

లింక్: https://amzn.to/4ecrM6S

 

Leave a Reply

error: Content is protected !!