భారతీయ సాంస్కృతిక సంప్రదాయాల్లో మహాభారతం ఎంతో విశిష్టమైనది. ‘తింటే గారాలే తినాలి, వింటే భారతం వినాలి’ అనే నానుడి వినే ఉంటారు కూడా.. చిన్నప్పటి నుంచి భారతాన్ని ఏదో ఒక రూపంలో చదువుతూనే ఉన్నాము. అందరి పాత్రల స్వభావం తెలిసిందే. కుట్రలు,కుతంత్రాలు.., వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చాలా వరకు తెలిసినవే.. ఇప్పటికీ ఎంతో మంది మహాభారతాన్ని ఎన్నో విధాలుగా రాసినా, మళ్ళీ ఇంకో సారి చదవాలి అనిపించే ఇతిహాసం. మహాభారతాన్ని మొదటగా వ్యాసుడు రాస్తే, తర్వాత ఎంతో మంది అనుసృజన లేదా అనువాదం రాశారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ లో ఎక్కువగా మహాభారతంలోని పాత్రల పాయింట్ ఆఫ్ వ్యూ (POV) లో తిరిగి రాస్తున్నారు.. అయితే తెలుగులో ఇలా ఇతిహాసంలోని పాత్రల కోణం నుంచి రాస్తున్న కథలు చాలా తక్కువ ఉన్నాయి. అర్జునుడి కోణంలో మహాభారతాన్ని అర్దం చేసుకోవడానికి నీలోత్పల గారు ‘మైత్రి’ అనే నవల రాశారు.!!

ఈ నవల అర్జునుడి కోణంలో చెప్పిన భారతం. ముఖ్యంగా అర్జునుడికి, కృషుడికి మధ్య ఉన్న స్నేహం గురించి, గురు శిష్యుల బంధం గురించి చెప్పిన నవల. అర్జునుడు మొదటి సారి కృష్ణుడిని కలిసినప్పటి నుంచి, మహాభారత యుద్ధం అయిపోయి, భీష్ముడి మరణం వరకు ఈ నవల ప్రధాన వృత్తాంతంగా తీసుకున్నారు..!!
సాధారణంగా మహాభారతాన్ని మంచి – చెడు, ధర్మం – అధర్మం మధ్య యుద్ధం అనే ధృకోణంలో చూసే మనం, ఈ పుస్తకం అర్జునుడి కోణంలో చెప్పడం వల్ల, ధీరత్వం మాత్రమే కాకుండా, ధర్మ సందేహాలకు సమాధానం ఇచ్చే అంశం కూడా చూడచ్చు. అర్జునుడు – కృష్ణుడు మధ్య ఉండే స్నేహ బంధాన్ని చాలా బాగా వివరించారు.
పుస్తకంలో ఉపయోగించిన భాష చాలా సులువుగా ఉండటమే కాకుండా, మహాభారతంలో ఉండే ఎన్నో చిన్న చిన్న కథలను కూడా జాతపరిచారు.
అయితే, ఈ నవల ముఖ్యంగా మైత్రి గురించి అని చెప్పారు రచయిత గారు.. కానీ కేవలం భీష్ముడి మరణంతో ఆగిపోకుండా, కృష్ణుడి మరణం తెలుసుకున్న అర్జునుడు ఎలా ప్రవర్తించాడు, కృష్ణుడు లేని తన జీవితం ఎలా ఊహించుకున్నాడు వంటి విషయాలు కూడా రాసి ఉంటే బాగుండేది.
మహాభారతాన్ని ఇంత వరకు చదవని వాళ్ళు, ఈ పుస్తకం తో మొదలుపెట్టచ్చు. అర్జునుడి కోణంలో చదవాలి అనుకొనే వాళ్ళు కూడా ఈ పుస్తకం చదవచ్చు..!
పుస్తకం ధర : 250/-
ఆ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.
లింక్ : https://amzn.to/3VEbsEN








