పుస్తక పరిచయం : ‘టిట్ బిట్స్’ – నవలిక

మొన్న మేము నిర్వహించిన ‘కథా తోరణం’ కార్యక్రమంలో ‘పాఠకుల వేదిక’ చర్చలో పాల్గొన్న పాఠకుల్లో ఎక్కవ మంది, ప్రేమ కథలు చదవలేకపోతున్నాము అని, తెలుగులో విభిన్న అంశాలతో కథలు కానీ, నవలలు కానీ రావట్లేదు అని ముక్తకంఠంతో చెప్పారు. అది పాక్షికంగా నిజమే. ఈ మధ్య కాలంలో చాలా ప్రేమ కథలు వస్తున్నాయి. అయితే, కాస్త కొత్తగా రాసిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే, జనవరిలో నేను చదివిన ‘టిట్‌బిట్స్’ అనే నవల/నవలిక గుర్తు వచ్చింది. ఇంతకీ ఇది ప్రేమ కథేనా? ఏమో .!! చదివి తెలుసుకోవాల్సిందే. 

హైదరాబాద్ నగరాన్ని కథా స్థలంగా తీసుకుని రాసిన నవలిక. ఈ కథలో పాత్రలు ఉండరు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అంతే. అమ్మాయి, ఇంటర్నెట్ ద్వారా పరిచయం అయిన అబ్బాయితో సరదాగా గడిపిన కొన్ని క్షణాలే ఈ ‘టిట్‌బిట్స్’. కేవలం 93 పేజీలు మాత్రమే ఉండే ఒక చిన్న స్నేహంలో (?), ఈ ఇద్దరు కలుసుకున్న ప్రతీ సందర్భాన్ని ఒక చాప్టర్‌లాగా రాశారు. చాప్టర్‌కి తగ్గట్టు బొమ్మ కూడా. ఇంతే కథ.!! ఇంత కన్న ఎక్కువ చెప్పేస్తే, చదవడానికి ఏమీ ఉండకపోవచ్చు.

మనకి తెలిసిన ప్రేమ లేదా స్నేహం కథలు అన్ని కూడా ఎన్నో రోజుల ఎదురుచూపుల తర్వాత, కొన్ని బిడియాలు, భయాలు దాటుకొని కలిసి మాట్లాడుకోవడంతో మొదలవుతుంది. కానీ, ఈ కాలం నిజంగా అలా ఉంటున్నారా? ఆన్లైన్ స్నేహాలు పెరిగిపోయిన తర్వాత, అన్ని కూడా Gbps వేగంతో కదిలిపోతున్నట్టు, ఈ కథ కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. అయితే, ఇంత వేగంగా కలుసుకుని, ఎన్నో అనుభవాలను పదిలం చేసుకుంటున్న ఈ ఇద్దరూ, చివరి వరకు కలిసే ఉంటారా? లేదా అన్ని కథలనే విరహంతో ముగుస్తోందా?..తెలియాలి అంటే ఈ నవల చదవాల్సిందే. 

నేటి తరం బాగా కనెక్ట్ అయ్యేలా, సులువైన పదాలతో అల్లిన కథ ఈ నవలిక. అయితే, ఎక్కడా కూడా  Quotations (“,”) వాడకపోవడం వల్ల , ఏ మాట ఎవరు చెప్తున్నారో, చెప్పడం కొంచెం కష్టం. ఇది ఒక్కటే పంటి కింద రాయి లాగ, గులాబీ కింద ముల్లులాగా తగులుతుంది. 

సరదాగా, వొ రెండు గంటలు ఈ జంటకి ఇస్తే, మనకి కొన్ని రోజుల పాటు గుర్తుంటారు. 

ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది. 

లింక్ : https://amzn.to/3FfCuwM

ధర: 150/-

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading