పుస్తక పరిచయం – సిరా

నషి జీవితంలో అత్యంత ముఖ్యమైన వయసు యవ్వనం.  కొత్త ఆలోచనలు, భావాలతో ఉంటారు . స్నేహితులు, ప్రేమ, చదువు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. స్వతంత్రం  కావాలనిపిస్తుంది. తల్లిదండ్రుల మాట వినకుండా వాదించాలని, తమకి నచ్చినట్టుగా ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి ఉత్సాహం ఉన్న వాళ్ళను, చదువు, మెరుగైన జీవితం అందించాలి అనే ఉద్దేశంతో తల్లితండ్రులు కోచింగ్ కోసం అని, రోజుకు 15-18 గంటలు చదువు చెప్పే(?) సంస్థల్లో చేర్పిస్తారు. అయితే అక్కడి ఒత్తిడిను తట్టుకోలేక, తల్లితండ్రులకు చెప్పుకోలేక, తెలియని ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నిర్బంధ విద్య, బలవంతపు చదువుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలనే తన కథాంశంగా తీసుకొని, దీనినే ఒక కోర్ట్ రూమ్ డ్రామా స్టైల్ లో రాజ్ మాదిరాజు గారు ‘సిరా’ అనే నవల రాశారు. 

 

Buy Sira [Soon to be a Motion Picture - Novel] (Telugu) Book Online at Low Prices in India | Sira [Soon to be a Motion Picture - Novel] (Telugu) Reviews & Ratings - Amazon.in

 

లా ఫైనల్ ఇయర్ చదువుతున్న ‘రామ్’, తన కాలేజ్ కి గెస్ట్ లెక్చర్ చెప్పడానికి వచ్చిన ప్రముఖ న్యాయవాది ‘మనోహర మూర్తి’ దగ్గర internship చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో తనకు అనుకోకుండా పరిచయమవుతాడు ‘ఆదర్శ్’. అయితే కొన్ని రోజులకు ఆదర్శ్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్యకి కారణం తెలుసుకున్న రామ్, తనకు గురువైన మనోహర మూర్తికి వ్యతిరేకంగా కేసు వాదించడానికి పూనుకుంటాడు. అసలు ఆదర్శ్ ఎందుకు చనిపోతాడు?, రామ్ ఈ కేసులో గెలుస్తాడా..? ఆదర్శ్ ఆత్మహత్య, పాతికేళ్లుగా విద్యారంగంలో ఎంతో మందికి విద్య నేర్పిస్తున్న ‘సిరా’ కాలేజీకి ఏంటి సంబంధం? వంటి విషయాలనే తమ కథాంశంగా తీసుకున్నారు. 

ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా స్టైల్ లో రాసిన థ్రిల్లర్ నవల. అందుకే ఏకబిగిన ఒకేసారి పూర్తి నవలను చదివేస్తాము. ఇండియన్ లాలో ఉండే విషయాల గురించి ప్రస్తావిస్తూ, సూసైడ్ చేసుకొనే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది!!? , సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను చెప్తూ, చాలా ఆసక్తి కలిగేలా రచనశైలి ఉంది.. కోర్ట్ రూమ్ లో జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. 

నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన విషయం ప్రతి పాత్రకు బ్యాక్ స్టోరీ రాయడం. అలా ఉండటం వలన పాత్రను అర్దం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఎమోషన్స్ కూడా చాలా బాగా రాశారు.. ముఖ్యంగా రామ్​కి ఆశకి మధ్య, రామ్​కి మూర్తి మధ్య సంభాషణలు చాలా బాగుంటాయి..

యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ‘అభిలాష’ నవలలా అనిపిస్తున్నా, తీసుకున్న వృత్తాంతం మనల్ని ఆలోచింప చేస్తుంది.

ప్రతీ తల్లితండ్రులు, ముఖ్యంగా యువత చదవాల్సిన పుస్తకం ఇది.. ఇందులో ప్రస్తావించిన విషయాల గురించి చర్చించాల్సిన అవసరం చాలానే ఉంది..!!

ఈ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంది..

లింక్ : https://amzn.to/3TRhZem

 

One thought on “పుస్తక పరిచయం – సిరా

  1. ఫైనల్ ఇయర్ చదువుతున్నంత మాత్రాన కేసు గురించి వాదాడ లేం. Party in Person అనే అప్లికేషన్ హైకోర్టు కి సమర్పించాలి. ఛీఫ్ జస్టిస్ ఇద్దరు రిజిస్ట్రార్ లని నియమించి ఓ ఇంటర్వ్యూ కి ఏర్పాటు చేస్తారు. ఈ వివరాలు, సైకియాట్రిస్ట్ వాదనల ని రచయిత పొందు పరిచాడా??

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading