నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, హంపీ మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి.. ఒకటి నేను పుట్టిన ఊరు, ఇంకోటి నన్ను నాకు పరిచయం ఊరు ఊరు అయితే, ఇంకోటి ఇంతవరకు చూడకపోయినా ఆ ప్రదేశం గురించి చాలా చదివి, విని నచ్చిన ప్రదేశం. అదే హంపి. హంపి ఆధారంగా ఎలాంటి కథ రాసిన నేను తప్పకుండా చదవడానికి ప్రయత్నిస్తాను.. అలా చదివిన పుస్తకమే మారుతి పౌరోహితం గారు రాసిన ‘ప్రణయ హంపీ’ నవల.

విజయనగర సామ్రాజ్య రాజధానీ, ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్న హంపి, ఈరోజు నిర్జీవంగా, నివాస యోగంగా లేకుండా మారిపోయిన పరిస్థితులు నన్ను ఎప్పుడూ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ కారణాల తెలుసుకోవడంలో తెలియని ఆసక్తి కూడా ఉంది. ఈ కారణాల వల్ల కూడా ఈ పుస్తకం చదివే అవకాశం దొరికింది.
పుస్తకం పేరులో ఉన్నటే ఇది ఒక ప్రేమ కథ.. విజయనగర సామ్రాజ్యంలో అళియరాయులు పరిపాలిస్తున్న కాలంలో సంబజ్జగౌడ, ముద్దుకుప్పాయి ల ప్రేమ కథ.
సంబజ్జగౌడ అళియరాయుల అంగరక్షకుడు. ముద్దుకుప్పయి ఒక కళాకారిణి. మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. కానీ అదే సమయంలో రాజ్యంలో యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. సంబజ్జగౌడ యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. యుద్ధానికి వెళ్ళిన సంబజ్జగౌడ సజీవంగా వస్తాడా!!? యుద్ధంలో ఎవరు గెలిస్తారు!? అనేది మిగతా కథా.
సాధారణంగా యుద్ధ కథలు అనగానే ఎక్కువగా రాజుల గురించి, రాజకీయాల గురించి మాత్రమే చదివే మనం, యుద్ధ సమయాల్లో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉంటుంది!!? వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది..!! వారి ఆహార, వ్యవహారాలు ఎలా ఉంటాయి వంటి విషయాల గురించి పెద్దగా చర్చించుకోము. ఈ పుస్తకంలో మారుతి పౌరోహితం గారు ఈ అంశాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు.
కేవలం 110 పేజీలు మాత్రమే ఉండే చిన్న కథ ఇది. కానీ ఇంత చిన్న నవలలో కూడా హంపి నగరం గురించి, అప్పటి సంప్రదాయాల గురించి, ఉత్సవాల పద్ధతి గురించి చాలా వివరంగా రాశారు. అలానే యుద్ధంలో అందరూ సైనికుల గురించి, యుద్ధ ప్రణాళికల గురించి మాత్రమే చెప్తే, ఈ పుస్తకంలో సైనికుల శారీరిక అవసరాలు కోసం వైశ్యుల గురించి, ఆహార అలవాట్లు గురించి వివరంగా చర్చించారు.
ఇక్కడ ప్రత్యేకంగా వేశ్యుల ప్రస్తావన గురించి తప్పకుండా చెప్పుకోవాలి. విజయనగర సామ్రాజ్యంలో వ్యభిచారం చట్టసమ్మతమైనది. ఆ కారణంగా ఎంతో మంది పేదలు తమ సంతానాన్ని వ్యభిచారంలోకి దింపేవారు. అలా వెళ్లిన వాళ్ళ జీవితాలు, ముఖ్యంగా యుద్ధ సమయంలో ఎలా ఉండేది అనేది ఈ నవలలో ఎంచుకున్న మరో ముఖ్య అంశం.
చారిత్రాత్మక నవలలు ఇష్టపడే వాళ్ళు ఈ నవల తప్పకుండా చదవాలి. తెలుగులో కొత్తగా పుస్తకాలు చదవడం మొదలు పెట్టాలి అనుకొనే వాళ్ళకి కూడా ఈ నవల ఒక మంచి ఎంపిక అవుతుంది.
ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది లేదా.
పుస్తకం ధర : 150/-








