పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
ఒక వర్షం పడుతున్న సాయంత్రం, ఎటూ వెళ్లనేని స్థితిలో పక్కన ఉన్న పుస్తకం చదవడం మొదలుపెడితే, ఆ పుస్తకం దాదాపు పది కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్ళింది. అదే శ్రీఊహ గారు రాసిన ‘బల్కావ్’ కథల పుస్తకం.

ఈ పుస్తకంలో మొత్తం 10 కథలు ఉన్నాయి.. తొమ్మిది కథలు మన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల కథలు. ఈ కథల్లో ఎక్కువ భాగం మనకు ఇంత వరకు తెలియని జీవితాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
PDSU లీడర్ జార్జ్ రెడ్డి హత్యను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన కథగా ‘లడాయి’ కనిపిస్తే, అదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో నక్సలైట్లలకు వ్యతిరేకంగా పని చేస్తున్న సల్వాజుడుం, గిరిజనులను మభ్యపెడుతున్న విషయాన్ని ‘ఆతీ’ కథలో చూపారు.
బ్రతకడానికి డబ్బులు కోసం కుటుంబం మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న మహిళల గురించి ‘ బర్కత్ ‘ కథలో చెప్తే, తమ పరపతి చూపించుకోవడానికి చీటి పాట, ఇంట్లో పూజ పేరుతో జరిగే వ్యాపారం గురించి ‘కిట్టి పార్టీ’ అనే కథలో చూపించారు.
జీవితంలో తోడు ఎంత అవసరమో ‘ముడుపు’ ద్వారా చెప్తే, , ఆ తోడుతో జీవితంలో జ్ఞాపకాలు పంచుకోవడం ఎంత అవసరమో ‘కాసిన్ని పూలు’ కథలో చెప్పించారు.
ఇలా ప్రతి కథలో మనకి తెలియని, తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాల గురించి చెప్తూనే, ఆ ప్రాంత చరిత్ర, ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా రాశారు.
‘తారానా’ అనే కథను మరికాస్త నిడివి పెంచి ఒక నవలగా రాసే ప్రయత్నం చెయ్యచ్చు అని అనిపించింది.
ముందే చెప్పినట్టు, ఒక చల్లని సాయంత్రం అలా మన సోఫాలో కూర్చుని, దేశం మొత్తం తిరగడంలో ‘బల్కావ్’ పుస్తకం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
ఈ పుస్తకం Amazon లో ఉంది.
లింక్ : https://amzn.to/3ARdclZ