పుస్తక పరిచయం – ఆకాశ గానం

కొన్ని కథలకు ఉపోద్ఘాతం రాయలేము. కేవలం మనం చదువుతున్నపుడు అనుభవాల గురించి మాత్రమే చెప్పగలము. అలాంటి పుస్తకమే బండి నారాయణ స్వామి గారు రాసిన ‘ఆకాశ గానం’ నవల. 

 

ఆకాశ గానం- Akasaganam- A Novel (Telugu)

 

మనం సాధారణంగా సమాజంతో సంభాషిస్తున్నప్పుడు  వచ్చే ఎన్నో ప్రశ్నలు ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రకు కూడా వస్తాయి.. వాటికి తనదైన విశ్లేషణ చేసుకుంటూ ఉంటాడు కూడా. అస్తిత్వవాదాన్ని వివిధ కోణాల నుంచి రచయిత ఆవిష్కరిస్తారు. 

ఈ నవల అనంత్ అనే యువకుడి ప్రయాణం. తన డిగ్రీ కాలేజీ నుంచి, అస్తిత్వవాదాన్ని నమ్మడం వల్ల జీవితంలో జరిగిన పరిణామాలే ఈ నవల ముఖ్య కథనం. కొన్ని చోట్ల అనంత్ లో నన్ను నేను చూసుకున్నా. ముఖ్యంగా పెళ్ళి, సంతానం, స్వేచ్ఛ వంటి విషయాల గురించిన ఆలోచనలలో. 

ఇది ఒక ప్రేమ కథ. కానీ మనుషులు అర్ధం చేసుకోవటానికి ఇది మాములు ప్రేమ కాదు అన్నట్టు, platonic love story ఇది. 

చలం రాసిన ‘మైదానం’, గోపీచంద్ రాసిన ‘మెరుపుల మరకలు’ ,ఈ  రెండూ కూడా స్త్రీ దృకోణంలో ప్లాటోనిక్ లవ్(Platonic Love)  గురించి రాస్తే, ఈ నవల ఒక పురుషుడి కోణం లో రాశారు. 

రచన పరంగా ఇది ఒక క్లోజడ్  ఎండింగ్ అయ్యి ఉండచ్చు కానీ,  ఆలోచనల్లో ఇది ఓపెన్ ఎండింగ్​లా అనిపించింది. 

ఒకే  విషయం గురించి over information ఇవ్వడం, కొన్ని చోట్ల ఇది నేరేటర్ ఆలోచనో, ప్రధాన పాత్ర ఆలోచనో అర్ధం కాకపోవడం వంటి చిన్న చిన్న విషయాలు కొంచెం ఇబ్బంది పెట్టాయి. 

చాలా కాలం తర్వాత ఒక సీరియస్ పుస్తకం చదివిన అనుభూతి కలిగింది. 

ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది. 

 

లింక్ : https://amzn.to/3UFPU92

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading