నేడు మన చుట్టూ సెక్సువల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మొబైల్స్ వచ్చిన తర్వాత నుంచి ఇది మరీ ఎక్కువైంది. ఈ సెక్సువల్ కంటెంట్ ఎంత ఎక్కువైందో..దానికి తగ్గట్టు సెక్ ఎడ్యుకేషన్ అనేది అంత తగ్గిపోయింది. తాము Online లో చూసిందే శృంగారం అనే భ్రమతో చాలా మంది ఉన్నారు.. ఆ కారణం వల్లే ఈ రోజు సెక్సువల్ అబ్యూజ్ అనేది చాలా తీవ్రమైన స్థాయికి చేరుకుంది. మన దేశంలో ఇలాంటి చర్యలకు కఠినమైన చట్టాలు ఉన్నా, Marital abuse మీద చట్టాలు సరిగా లేవు. Consent అనేది ఎంత అవసరమో, అలానే శృంగారంలో మన Partner ఇష్టాలను గౌరవించడం కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని తన ముఖ్య కథాంశంగా గీతాంజలి గారు ‘విత్ యువర్ పెర్స్మిషన్’ అనే నవలలో తీసుకున్నారు.

మహిమ, చరణ్ భార్యాభర్తలు. పెద్దలు కుదిర్చిన వివాహం. కానీ మహిమకు ఇష్టం లేకపోయినా కూడా చరణ్ మహిమతో శృంగారం చేస్తాడు, చాలా వికృతంగా ప్రవర్తిస్తాడు. తన పరిస్థితి గురించి తల్లితండ్రులకు చెప్పినా, ‘చేస్తున్నది నీ భర్తే కదా.. సర్దుకొని ఉండు..’ అని చెప్పి సర్డిచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మహిమకు చరణ్ ను చూడాలంటే తెలియని భయం, జుగుప్స. ఇలాంటి సమయంలో వరద అనే లాయర్ పరిచయంతో తాను ఒంటరి కాదు.. తనలానే ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అని తెలుసుకొని భార్యల మీద భర్తలు చేసే లైంగిక దాడుల గురించి ఒక నవల రాయాలి అని అనుకుంటుంది. అలా వేరు వేరు స్త్రీల కథల సమాహారమే ఈ నవల.
ఈ నవల ఒక Semi fictional స్టోరీ.గీతాంజలి(డా. భారతి) గారు వృత్తి రీత్యా డాక్టర్ అవ్వడం చేత, తన దగ్గరికి వచ్చిన పేషంట్స్ జీవితాల ఆధారంగా రాసిన నవల ఇది. స్త్రీలు వివాహంలో ఎదుర్కున్న లైంగిక దాడుల గురించి, దాని నుంచి తాము ఏ విధంగా బయటపడ్డారు అనే విషయాల గురించి రాసిన నవల.
ఈ నవల నేను పూర్తిగా చదవలేకపోయాను. ఇందులో భార్యలు మీద తమ భర్తలు చేసిన లైంగిక దాడుల గురించి చెప్పే విధానం, వారు అనుభవించిన బాధ గురించి చదువుతున్నపుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది.
దాదాపు 25 మంది స్త్రీల జీవితల గురించి ఈ పుస్తకంలో చూపించారు. అయితే కంటెంట్ పరంగా చాలా అవసరమైన నవలైనా కూడా.. కేవలం issues డాక్యుమెంటేషన్ వరకు మాత్రమే కాకుండా, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన వంటి విషయాల గురించి కూడా చర్చించి ఉంటే బాగుండేది అనిపించింది.
ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.
పుస్తకం ధర : 200/-








