పుస్తక పరిచయం : రెండు గుండెల చప్పుడు
రెండు గుండెల చప్పుడు – యండమూరి వీరేంద్రనాథ్ స్వేచ్ఛ అంటే ఏమిటి? మనకు నచ్చినట్టు జీవించడమా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే హక్కు కలిగి ఉండటమా?
నేను విశాఖపట్నంలో పెరిగినా, పుట్టింది మాత్రం రాయలసీమ ప్రాంతంలోనే. మా అమ్మమ్మ, బంధువులు అందరూ కూడా రాయలసీమ అది కూడా ముఖ్యంగా నంద్యాల, గిద్దలూరు ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తూ, గిద్దలూరు దాటాక వచ్చే నల్లమల అడవులు అంటే భయమే. నిద్ర రాకపోయినా కావాలని పడుకున్నట్టు నటిస్తూ ఉండేవాడిని. కానీ మా తాతయ్య తన ఉద్యోగం వల్ల వేసవిలో ‘బడి బాట’ కార్యక్రమం పేరుతో పల్లెలోకి వెళ్తూ ఉండేవాడు. నేను కూడా కొన్ని రోజులు వెళ్లేవాడిని. అలా వెళ్లిన అనుభవమే రాయలసీమ ప్రాంత పరిసరాలను చూడటం. కొంచెం పెద్దయ్యాక సెలవుల్లో ఏదైనా ఊరుకు తీసుకొని వెళ్ళమని చెప్తే, మా తాతయ్య అహోబిలం, యాగంటి,అవుకు,బనగానపల్లె, మహానందికి తీసుకొని వెళ్లేవారు. కాబట్టి నాకు తెలిసిన రాయలసీమ ఇదే. ఈ అనుభవానికి తగ్గట్టుగానే రాయలసీమ అనగానే కరువు ప్రాంతం అని, రాళ్లు, రక్తపాతం తప్ప ఇంకేం ఉండవు అని సినిమాల్లో, పత్రికల్లో చూపిస్తూనే ఉన్నారు. అయితే ఆ అనుభవాలకు విరుద్ధంగా రాయలసీమలో కూడా పచ్చటి పొలాలు ఉన్నాయి, ఎతైన కొండలూ, లోతైన లోయలు, సెలయేర్లు అన్నీ ఉన్నాయి అని వివేక్ లంకమల గారు తన పుస్తకమైనా “లంకమల దారుల్లో” ద్వారా పరిచయం చేశారు.

లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరం కొత్త విషయాలు లేదా కొత్త హాబీ నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాము. అలానే వివేక్ గారు కూడా లొక్డౌన్ లో తాను తన ఊరు చుట్టూ ఉండే ప్రాంతాలను వారాంతరాల్లో సందర్శించేవారు. అలా తాను వెళ్లిన ప్రయాణం యొక్క అనుభవాన్ని పుస్తకంగా రాశారు.
ఈ పుస్తకంలో మొత్తం 21 వ్యాసాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువుగా పెన్నా నది పరీవాహక రాయలసీమ ప్రాంతాలైన కడప జిల్లాలోని అడవులు,నదులు, జలపాతాలు, డ్యామ్‌లకు తాము వెళ్లిన ప్రయాణ వివరాలతో పాటు అక్కడి ప్రకృతి అందాలను, అక్కడ జీవిస్తున్న ప్రజల జీవితాల గురించి చూపించారు.
నాకు ఇంతవరకు పరిచయం లేని రాయలసీమ ప్రాంతాన్ని తెలుసుకొనే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది. అభివృద్ధి కోసం మనం కట్టే డ్యామ్ వల్ల మునిగిపోయే గ్రామాల గురించి, డ్యామ్ కారణంగా అక్కడ చేపల వేటకోసం కోస్తా జిల్లాల నుంచి వలస వచ్చే కూలీల జీవితాల గురించి కూడా తెలుసుకున్నాను. ఈ పుస్తకం ద్వారా నాకు ఒక virtual tour చేసిన అనుభూతి కలిగింది. అక్కడక్కడా వివేక్ గారు తమ తాత్విక ఆలోచనలను పంచుకుంటూ, మనల్ని కూడా ఆలోచింపచేస్తారు.
ఈ పుస్తకం రాయలసీమలోని పెన్నా నది పరీవాహక ప్రాంత దర్శనకు ఒక గైడ్ లాగ ఉపయోగపడుతుంది. త్వరలో ఈ పుస్తకంలో చూపించిన ప్రాంతాలు అన్నీ వెళ్ళాలి అని కుతూహలంగా ఉంది.
పుస్తకం లో ప్రస్తావించిన ప్రదేశాల ఫోటోలు కూడా add చేసి ఉంటె బాగుండేది ఎందుకంటే చాలా ప్రదేశాలు google maps లో కూడా దొరకలేదు ముఖ్యంగా లంకమల రిజర్వు ఫారెస్ట్, మల్లెంకొండ, రాజులచెరువు వంటివి.
రాయలసీమలో మనకి తెలియని ప్రకృతి అందాలను తెలుసుకోవాలంటే, ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. చదివిన తర్వాత ఆ ప్రదేశాలకు వెళ్ళాలి.
ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.
పుస్తకం ధర : 300/-