పుస్తక పరిచయం: ఆకాశం సాంతం

 

1951 లో హిందీలో రాజేంద్ర యాదవ్ రాసిన ఈ సారా ఆకాశ్ అనే నవల తెలుగులోకి ఆకాశం సాంతం అనే పేరుతో అనువాదం చేశారు.

భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, జీవితంలో ఎన్నో ఆశయాలతో, తనకి కుదిరినంత వరకు చదువుకోవాలి అనుకున్న సమర్, తన అనుమతి లేకుండా, తనకు నచ్చని పెళ్లి చేస్తారు. అలా, ప్రభకు భర్త అయిన సమర్, తన వివాహిత జీవితాన్ని ఎలా గడిపారు, తన ఆశలు, ఆశయాలు ఏమయ్యాయి.. వంటివి తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవాలి.

స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి యువకుల అలోచనలు, దానికి తోడు వారి కుటుంబ పరిస్థితులు, ముఖ్యంగా సంప్రదాయం, ఆధునికత మధ్య ఉండే ఘర్షణ వంటి ఎన్నో విషయాల గురించి ఈ పుస్తకంలో చూడచ్చు. వీటితో పాటు, అప్పటి సమాజంలో స్త్రీలు అనుభవించిన క్షోభ, వారి మీద జరిగిన అణిచివేత ఈ నవలలోని పాత్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

స్వాతంత్రం అప్పుడు మన దేశ పరిస్థితులు, ముఖ్యంగా యువకుల ఆలోచనను తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి.

ఈ పుస్తకం NBT వారు ప్రచురించారు. చాలా తక్కువ పుస్తకాలు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి..కనిపిస్తే కొనేయండి.

 

 

 

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading