పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
నా పేరు కొత్త సాయి కుమార్. పుట్టింది, పెరిగింది, చదువు అంత గుంటూరు, ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. B. Tech C.S.E చేశాను. 2015 నుంచి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. పుస్తకాలు చదవడం, స్నేహితులతో పుస్తకాల గురించి మాట్లాడటం చాలా ఇష్టం. తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు నెలకి 10 వరకు చదువుతుంటాను.

నేను సెవెంత్ క్లాస్ లో వున్నపుడు మా ఇంగ్లీష్ సార్ లైబ్రరీ గురించి చెప్పారు ఆ రోజు ఫస్ట్ టైం నాకు అకడమిక్ బుక్స్ కాకుండా వేరేవి ఉంటాయి అని తెల్సింది. లైబ్రరీస్ ఎన్ని రకాలు, స్టేట్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ, మొబైల్ లైబ్రరీ అని లైబ్రరీస్ గురించి చెప్పారు. గుంటూరు లో ఏసీ కాలేజీ ఎదురు స్టేట్ లైబ్రరీ ఉంటుంది అన్నారు, అది గవర్నమెంట్ లైబ్రరీ కాబట్టి ఫ్రీ గా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు అని చెప్పారు. నాతో పాటు కొంత మంది ఫ్రెండ్స్ కుడా వచ్చారు అలా స్టార్ట్ అయింది నా రీడింగ్ జర్నీ. 9th క్లాస్ లో స్టేట్ లైబ్రరీ లో మెంబర్ షిప్ తీస్కొని వారానికో రెండు పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను, బీటెక్ లో యండమూరి గారి బుక్స్ చాలా చదివాను, తర్వాత పది సంవత్సరాలు ఇంగ్లీష్ బుక్స్ చదివాను. కరోనా టైం లో మళ్ళీ తెలుగు పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. సిరా, సోల్ సర్కస్ పుస్తకాలతో స్టార్ట్ అయ్యి సంవత్సరానికి ఇపుడు 50 తెలుగు పుస్తకాలు చదువుతున్నాను.
యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్ల. మంచి ఎమోషనల్ ప్రేమకథ, చదివిన తర్వాత ఏడ్చిన కథ. సంభాషణలు చాలా బాగుంటాయి ఈ పుస్తకంలో.
యండమూరి గారి అంతర్ముఖం కచ్చితంగా చదవమంటాను, జీవితం గురించి ఒక క్లారిటీ, ఇండివిడ్యుయల్ థింకింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు నేను ఈ పుస్తకం మూడు సార్లు చదివాను. చదివిన ప్రతి సారి ఎదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే వుంటాను.
యండమూరి గారిని కలిసి తాను, తన పుస్తకాలు, నేను ఎదుగుతున్న సమయంలో ఎంత ఉపయోగ పడ్డాయో అని చెప్పాలని ఉంది, రీసెంట్ గా మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ‘అందమైన జీవితం’ పుస్తకం చదివాక మల్లాది గారి అన్ని పుస్తకాలు చదవాలి అనిపించింది. ఎదో ఒక రోజు వీళ్ళ ఇద్దర్ని కలిసి థాంక్స్ చెప్పాలి.
కాంటెంపరరీ బుక్స్ ఎక్కువ చదువుతా నేను. కేర్ అఫ్ బావార్చి – చరణ్ పరిమి, ఇసుక అద్దం – శ్రీ ఊహ, సోల్ సర్కస్ – వెంకట సిద్ధారెడ్డి, వైతారని ఒడ్డున, నృకేసారి – కవనమాలి, బాహుదా బతుకు కథలు – సుదర్శన్, అభినిర్యాణం – ప్రవర్ష్, నేను బాగా ఎంజాయ్ చేసిన పుస్తకాలు.
వాకింగ్ చేస్తూ ఆడియోబుక్స్ వినడం, పుస్తకం చదవడం అలవాటు, బుక్స్ తో నడిచిన ప్రతి క్షణం ఒక మెమరీ. డల్ గా వున్నపుడు మనసుకి నచ్చిన పుస్తకం తో అలా నడుస్తా.
అభినిర్యాణం – ప్రవర్ష్, డెవిల్స్ మైండ్ – కిరణ్ కుమార్ సత్యావోలు,నృకేసరి – కవనమాలి ఈ మూడు పుస్తకాలు నేను చాలా ఫాస్ట్ గా నిద్రని ఆపుకొని మరి చదివిన పుస్తకాలు.
చిన్నప్పుడు ఏ పుస్తకం దొరికితే అది చదివేసే వాడిని, పుస్తకం నచ్చింది, నచ్చలేదు అని అభిప్రాయం గట్టిగా చెప్పేవాడ్ని కాదు. పుస్తకాలు చదువుతున్న కొద్దీ నాకు ఎలాంటి పుస్తకాలు ఇష్టం, పుస్తకం లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు చెప్పగలుగుతున్నాను. ఒకపుడు పుస్తకం నచ్చకపోయినా, బోర్ అనిపించినా పూర్తి చేయాలి అనుకునేవాడ్ని, ఇప్పుడు మాత్రం ఆ పుస్తకం ఆపేసి వేరే పుస్తకం మొదలుపెడుతున్న.
సినిమా లాగ అయితే, కిరణ్ కుమార్ సత్యవోలు రాసిన పీపాసి, డెవిల్స్ మైండ్, ప్రవర్ష్ రాసిన అభినిర్యాణం, సీతారామరాజు ఇందుకూరి రాసిన రమగ్రామ నుంచి రావణలంక వరకు.సిరీస్ లా అయితే ,కవనమాలి రాసిన నృకేసరి,రిషిత రాసిన టైట్బిట్స్, సుదర్శన్ రాసిన బాహుదా బతుకు కథలు.
లేటెస్ట్ గా ఎం రిలీజ్ అయ్యాయో చూస్కుంటాను. ఇంస్టాగ్రామ్ లో పబ్లిషర్స్ ని, రైటర్స్ ని, బుక్స్టాగ్రామ్ అకౌంట్స్ ని ఫాలో అవుతుంటాను, ఆ టైం కి నా మూడ్ బట్టి, లైట్ రీడ్ లేదా ఇంటెన్స్ రీడ్ స్టార్ట్ చేస్తాను. మోస్ట్ అఫ్ ది టైమ్స్ థ్రిల్లర్స్ ఉంటే అవి చదవడానికి ప్రిఫెరెన్స్ ఇస్తాను.
నాకు చదవడం ఆనందం , కథలు తెలుసుకోవడం ఇష్టం. ‘I just read for the Love of Reading ‘. కథలు మనకి జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడటానికి ఉపయోగపడే సాధనం. చివరికి ప్రతి మనిషి ఒక కథగా మిగిలిపోతాడు. కథగా మారేలోపు, వీలైనన్ని కథలని ఆస్వాదించాలి. మనిషిని, మిగతా స్పెసిస్ నుంచి వేరు చేసేది కథ. మన ముందు తరం మనకి ఇచ్చిన కథ, మన తర్వాత తరానికి మనం ఇచ్చే కథ, ప్రతి కథ మన కోసమే.