పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
కాసిన్ని కన్నీళ్లు
కాసిన్ని కన్నీళ్లు
మనసు బరువు దింపుకోవడానికి
సాయపడుతుంటే
ఎందుకంత అహం ?
ఏమవుతుంది ఏడిస్తే ?
బలహీనపడిపోతామా ? హీనమైపోతామా ?
చీలిన చర్మం నెత్తురును స్రవిస్తే
నలిగిన హృదయం అశ్రువులని ప్రసవిస్తుంది
ఎన్ని ఓదార్పులు భుజం తట్టినా
ఎంతటి మరపులు చుట్టూ చేరినా
ఒక నిమిషం పాటు గుక్కపట్టి ఏడ్చే ఏడుపు
ఇచ్చే ఊరట, మనసుకేదీ ఇవ్వలేదు సృష్టిలో
ఎందుకంత చిన్నచూపు ?
ఏడుపు అనేది ఏదో నీచమైన పని అన్నట్టు..!
మనం పుడుతూ చేసింది ఏమిటి ?
పోతూ అందరికీ మిగిల్చేది ఏమిటీ ?
నవ్వలేనివారే కాదు
నాకు తెలిసి ఏడవలేనివారు కూడా రోగులే..!
కొన్ని సార్లు
నవ్వి నవ్వి ఏడుస్తాం
ఆ నవ్వుల్లో కొన్ని నవ్వులు
మనని చూసి మనకి కలిగేవే
కొన్ని సార్లు
ఏడ్చి ఏడ్చి నవ్వుతాం
ఆ నవ్వు నుండే జీవితాన్ని
కొత్త కోణంలో చూడటం మొదలుపెడతాం
జీవంతో నిండిన మట్టి కన్నా
మట్టిలో పాషాణంలా మెరిసే బంగారానికే
ఎక్కువ విలువ నిచ్చే మనుషులం కదా
మరి ఒంట్లో ఉండే ఐదు లీటర్లు రక్తానికే
మనం అంత విలువనిస్తే
కంట్లో దోసిలి కూడా నిండని ఈ అరుదైన నీటికి
మనం ఇంకెంత విలువ ఇవ్వాలి ?
ఆ కన్నీళ్లు
ఒక విషయం వల్ల వస్తున్నామంటే
అది మనకి ఎంత ముఖ్యమై ఉండాలి?
ఆ కన్నీళ్ళని
ఒకరి కోసం రాలుస్తున్నామంటే
వాళ్ళు మనకు ఎంత ప్రాణప్రదమై ఉండాలి?
అలా కాని వాటికోసం, కాని వారికోసం
ఏ రోజూ ఓ చుక్క రాల్చినా
వజ్రాన్ని పేపర్ వెయిట్’గా వాడే మూర్ఖులమే అవుతాం
ఏడ్చే రోజులు రాకూడదని
మనం ఎన్ని దండాలు పెట్టుకున్నా
ఎన్ని మొక్కులు మొక్కుకున్నా
ఒప్పుకోవాల్సిన విషయం ఒక్కటే
ఏడుపు లేకుండా జీవితం లేదు
మనకి నచ్చినవి దూరం అవుతాయి
మన అనుకున్న వాళ్ళు దూరమవుతారు
మనకోసం మనమే నిలబడలేని రోజు వస్తుంది
మన కన్నీళ్లు మనమే తుడుచుకొని
ముందుకెళ్లే సమయం మనకోసం ఎదురుచూస్తుంది
@కవనమాలి