చక్కిలిగింత

ఇది రాచబాట కాదు
____
కప్పుడు మద్రాసులోని పానగల్ పార్కు కవులకు, గాయకులకు, కళాకారులకు కూడలిగా వుండేది. ఒకరోజు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, ఇంకా అయిదారుగురు మిత్రులు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక మల్లాది వారిని తమ ఇంటికి పిలిచి, ఆ పార్కు నుంచి రోడ్డున కాకుండా వేరే దగ్గర దారి ఒకటి వుంటే అటుగా తీసుకువెళ్తున్నారు ఆరుద్ర.

దారిమధ్యలో ఒక చోట కంచె వేసిన ఇనుపముళ్ళ తీగె అడ్డం వచ్చింది. ఆరుద్ర మెల్లగా వంగి ఆ తీగెను తప్పుకుని, మల్లాది వారిని కూడా జాగ్రత్తగా అవతలకు రప్పిస్తే “మొత్తానికి నాకు తలవొంపులు తెచ్చావే” అన్నారట తప్పుకున్నాక మల్లాదివారు.

“అడ్డదారులు తొక్కితే ఎప్పుడైనా, ఎక్కడైనా తలవొంపులు తప్పవు స్వామీ” అని జవాబిచ్చారట ఆరుద్ర.

* శ్రీరమణ గారి సంపాదకత్వంలో ప్రచురించబడిన హాస్యజ్యోతి అనే పుస్తకంలోనిది

link: https://www.telugubooks.in/products/hasyajyothi-sriramana

error: Content is protected !!