పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
-కవనమాలి
మా ఇల్లులు
పరదాలు కప్పుకోబోతున్నాయంటే
మా ఊరికి
ప్రముఖ నాయకులెవరో వస్తున్నారేమో
మా వీధులు
మాకే కొత్తగా కనబడబోతున్నాయంటే
మా ఊరికి
పరదేశీ ప్రముఖులు రాబోతున్నారేమో
మా రాతలు తుడిచిన
పార్టీ జెండాలు ఎగురుతున్నాయంటే
మా ఊరిలో
ప్రపంచ దేశాల సభ జరగబోతుందేమో
వారికి
కనిపించాలి, మా ఊరు గొప్పగా
కనిపించద్దు, మా బ్రతుకులు కాస్త కూడా
వారికి
వినిపించాలి, మా ఊరి గొప్పలు
వినిపించనివ్వొద్దు, నా బ్రతుకు వేదనలు
రోడ్లు గొప్పగా అనిపించాలనేమో
భిక్షగాళ్ళని కూడా దాచిపెడతారు
పాదచారుల బాటలు శుభ్రమని నమ్మించాలనేమో
చిరు వ్యాపారుల పొట్టలు కొడతారు
వందలో యాభై మంది
రోజులో ఓ పూట పస్తులుండే ఊరు..
పదిలో ఐదుకు పైగా
చదువుకున్న నిరుద్యోగులున్న ఊరు..
కులం మతం పేరులతో
రోజూ జనం కొట్టుకుచస్తున్న ఊరు..
రాజకీయ నాటకంలో
పదే పదే మోసపోతున్న మా ఊరు..
ఈ రోజు మాత్రం
అభివృద్ధి అనే పదాన్ని పక్కన కూర్చోబెట్టుకోబోతుందేమో
అందంగా ముస్తాబై మెరిసిపోతుందేమో..
పేపర్లలో టీవీల్లో ఫోన్లలో
ఇక మా ఊరి గురించే కబుర్లు ఓ నాలుగు రోజులు..
ఇంకేం ..
మా ఊరిలో అద్దెలు పెరుగుతాయి
మా ఊరి చుట్టూ భూమి ధరలు పెరుగుతాయి
మా ఊరోళ్లలో కొందరి జేబులు బరువెక్కుతాయి
తెల్లారితే పరదాలు పోతాయి..
రెండు రోజులు పోతే జెండాలు పడిపోతాయి..
వీధుల్లో అదే చెత్త మళ్లీ మిగిలిపోతుంది
ఇంటి ముందు కాలువ పొంగిపోతుంది
ఊరు ఎప్పటి హడావిడినే పాడుతుంది
ఆకలి నవ్వుతుంది
అవసరాలు తొక్కుతాయి
ఇవన్నీ మాకు తెలుస్తాయి కానీ
వచ్చి వెళ్లిన వాళ్ళకి మరి
ఎప్పటికైనా ఎలా తెలుస్తాయి ?
మళ్లీ వస్తేనూ ?
కప్పి తీసిన పరదాలు మళ్లీ దులిపి కప్పుతారేమో
అయినా ఇవన్నీ మాట్లాడకూడదు కదూ
మర్చిపోయా !
మనది రామరాజ్యం
మనది ప్రజాస్వామ్యం
మన ప్రభువు కలియుగ పరంధాముడు
మనకి లోటు ఏమిటి
మనకి కష్టం ఏమిటి
ఆబగా తిన్న తిండి అస్సలు అరగడం లేదు
ఖర్చుపెట్టాక మిగిలిన డబ్బు చెదలు పడుతుంది
ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, జనాలు కాదు
స్థిరచరాస్తులు లేనిది ఎవరికంటా ఇక్కడ
అందరూ వందేళ్లు పైగా బ్రతకగలిగిలిన వాళ్లే
ఇదండీ మా ఊరి భాగోతం