పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల

ఒకసారి ప్రకాశం పంతులు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో మాట్లాడుకుంటూ సచివాలయం ( గోవేర్నమెంటు ఆఫీస్) చేరుకున్నారు. అక్కడికి రాగానే విశ్వనాథ వారు ప్రకాశం గారిని సచివాలయంలో ఎదో పని ఉంది చేసిపెట్టమని అభ్యర్ధించుకున్నారు. వెంటనే ప్రకాశంగారు దాన్ని నిరాకరిస్తూ “ఈ సచివాలయం ఒక పెద్ద అడవిలాంటిది ఇక్కడ పని ఒక పట్టానికి తేలదు” . ఆ మాటకి నిరాశ చెందకుండా, విశ్వనాథవారు “అందుకే కదండీ మీకు చెప్పింది, మీలాంటి ఆంధ్రకేసరికి ఈ అడవి ఒక లెక్కా !” అంటూ చమత్కారంగా ప్రకాశంగారి బిరుదు అయినా “ఆంధ్రకేసరి” ( అంటే ఆంధ్ర సింహం) గుర్తు చేసారు. ఇక ప్రకాశం గారికి ఆ పని చేయక మానలేదు.