పుస్తక పరిచయం : రెండు గుండెల చప్పుడు
రెండు గుండెల చప్పుడు – యండమూరి వీరేంద్రనాథ్ స్వేచ్ఛ అంటే ఏమిటి? మనకు నచ్చినట్టు జీవించడమా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే హక్కు కలిగి ఉండటమా?
సాయిబు గడ్డం

ఆయనకు ఒక మూరెడు గడ్డం ఉన్నది. అవును, గడ్డం ఉన్నది కదా అని చెప్పి, ఆయన ఋషి అనుకుంటారు కొందరు కానీ ఆయన ఒక సీదా సాదా సాయిబు.
అయితే, సాయిబుకు నిండా అరవై ఏళ్ళు ఉండటం చేత, తలా తెల్లగా నెరిసిపోయి, జనపనారలా కనిపించేది. ఈ సాయిబుకి తన గడ్డం మీద ఎంతో ప్రేమ. ఆ గడ్డానికి నిగనిగలాడే నల్లటి రంగు వేయటం, నూనె రాయటం, షోగ్గా దువ్వటం, ఆయనకు ఎంతసేపు గడ్డం మీదనే మోజు కానీ తలని గురించి తగినంత శ్రద్ధ లేదు. అంచేత, గడ్డం మాత్రం నల్లగా నిగనిగలాడుతూ ఉండేది. తల మాత్రం తెల్లగా నెరిసిపోయింది.
ఆవూళ్లో కొంటె కుర్రవాళ్లు కొంతమంది సాయిబుగారి వాలకమంతా కనిపెట్టుతూనే వున్నారు. ఆయన్ని ఎట్లాగయినా ఎగతాళి చేసి, తాటాకులు కడదామని వాళ్ళలో వాళ్లు నిశ్చయించుకున్నారు.
ఒకనాడు వాళ్లు వచ్చి, సాయిబుగారి చుట్టూ మూగారు. ఆ సమయానికి సరిగ్గా ఆయన, ఉక్కబోస్తుందికదా అని నెత్తిమీది టోపీ తీసి కింద ఉంచాడు ఆ సాయిబు.
కుర్రవాళ్లు అమాయకంగా సాయిబుగారిని అడిగారు: “ఏమండి సాయిబుగారూ !— మా కొక సందేహం వచ్చింది. మీ తల మొత్తం ముగ్గుబుట్టలాగ తయారయింది కదా, మరి గడ్డంమాత్రం అంత నల్లగా వున్నదేమండి?” అన్నారు.
ఈ ప్రశ్నకి సాయిబుగారు మండిపడతారని ఆ ఆకతాయి కుర్రాళ్ల ఉద్దేశం. వాళ్లు అనుకున్నట్టు ఆయనకు ఎంతమాత్రం కోపం రాలేదు. సాయిబుగారు చిరునవ్వు నవ్వుతూ నిదానంగా యిలా చెప్పాడు:
“అబ్బాయిలూ! ఇందులో ఆశ్చర్యం ఏమిటుంది? తలవెంట్రుకలకంటే గడ్డం వెంట్రుకలు ఇరవై సంవత్సరాలు చిన్నవి. అందుకనే అవి నెరిసిపోయినాయి, ఇవి నల్లగా వున్నాయి…” అని.
సాయిబు చెప్పిన యీ సమాధానం విని కుర్రవాళ్లు సిగ్గుపడ్డారు.
ఈ కథలో కొన్ని నీతులు ఉన్నాయి గమనించారా ?
జుట్టు కూడా ముఖ్యంమే : సాయిబు గారు గడ్డానికి చూపిన శ్రద్ధ తల వెంట్రుకలకు కూడా చూపి ఉంటే, ఆయన తల కూడా గడ్డంలాగే నిగనిగలాడేది. మన శరీరంలోని ప్రతి భాగం పట్ల తగిన శ్రద్ధ వహించడం అవసరం, ముఖ్యంగా మన వెంట్రుకల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
చిలిపి చేష్టలను నవ్వుతూ స్వీకరించాలి: కుర్రవాళ్ళ ఎగతాళికి సాయిబు గారు కోపం తెచ్చుకోలేదు. వారి చిలిపితనాన్ని అర్థం చేసుకుని, ఓర్పుతో, చమత్కారంగా సమాధానం చెప్పారు. చిన్నపిల్లల అల్లరిని, లేదా ఎవరైనా చేసే సరదా వేళాకోళాన్ని సీరియస్గా తీసుకోకుండా, నవ్వుతూ ఎదుర్కోవాలి. అలా చేయడం వల్ల అనవసరమైన గొడవలు తప్పుతాయి, బంధాలు బలపడతాయి.